Sunday, February 18, 2024

IND VS NZ Threats :కీవీస్‌-భార‌త్‌ మ్యాచ్ కు బెదిరింపులు… అల‌ర్ట‌యిన ముంబై పోలీసులు

వాంఖడెలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌,కీవీస్ మ్యాచ్ కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ మ్యాచ్ జరిగే సమయంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంటుందంటూ ఓ ఆగంతకుడు ట్విట్టర్ లో బెదిరింపులకు పాల్పడ్డాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హెచ్చరించాడు.

దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలు కానుండగా గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం కలకలం రేగింది. ఈ ట్వీట్ నేపథ్యంలో స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement