Sunday, April 28, 2024

TS: రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాహేర్

నిజామాబాద్, మార్చి 5(ప్రభ న్యూస్) : రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహేర్ బిన్ హందాన్ హైదరాబాద్ లో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ కార్యాలయంలో తాహేర్ ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్సీ అరికేల నర్సారెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement