Thursday, May 2, 2024

కాల్వ శ్రీరాంపూర్ లో కేంద్ర బృందం పర్యటన

పెద్దపెల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2021లో భాగంగా శనివారం కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు రమేష్ ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో పర్య టించారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర బృందం సభ్యునికి సర్పంచ్ తో పాటు పలువురు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ మల మూత్ర విసర్జన విముక్తి, గ్రామం అనే బోర్డులను ట్యాబ్లలో అనుసంధానం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ సెక్రటరీలతో పారిశుధ్యంపై చర్చించి సూచనలు చేశారు.

పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడంతోపాటు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ అమలు తీరును పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య, భవనం, వ్యక్తి గత మరుగుదొడ్లు, మురికి కాలువలు.సెగ్రిగేషన్ చెడ్డు, పరిచిలించి,అంగన్వాడీ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంతోపాటు పారిశుధ్య నిర్వహణపై నివేదికలను అప్లోడ్ చేస్తామన్నారు. ప్రార్దన మందిరాలను పరి చిలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అధికారుల పనితీరు, ఇక్కడి వాతావరణం బాగుందని అబినందిచారు. ఇందులో భాగంగా తీసిన ఫోటోలను అప్లోడ్ చేశారు. పబ్లిక్ టాయిలెట్ను సైతం ట్యాబ్లో నమోదు చేసి కేంద్రానికి నేరుగా చేరుకుంటాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement