Friday, May 3, 2024

TS: సూర్యాపేట కౌన్సిల‌ర్ల‌ తిరుగుబాబు…చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాసం తీర్మానం

సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. తిరుగుబాటు కౌన్సిలర్లు అంతా కలిసి అవిశ్వాస తీర్మానం లేఖ‌ను కలెక్టర్‌కు అందజేశారు. సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళ కేటాయించారు.

అయితే నాటి విద్యుత్ శాఖ మంత్రి, నేటి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్లు జగదీష్ రెడ్డి జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పిస్తూ పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్ పర్సన్‌గా ఎంపిక చేశారు. స్వయంగా నాటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో చైర్పర్సన్‌ను ఎంపిక చేయడంతో ఎవరు కూడా నోరు మెదపలేకపోయారు. నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు అంతా అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అయితే శాసనసభ ఎన్నికలు పూర్తి కావడం టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం చేస్తూ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement