Saturday, December 7, 2024

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 దరఖాస్తు గడువు పెంపు…

అమరావతి, జనవరి 10(ప్ర‌భ‌న్యూస్‌): ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 సర్వీస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ గడువు తేదీని పొడిగించింది. ఈ మేర‌కు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో విడుద‌ల చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది.

అయితే తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో 897 గ్రూప్‌ 2 పోస్టులను భర్తీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement