Sunday, April 28, 2024

TS : తెలంగాణ‌లో పంట న‌ష్టాల‌పై స‌ర్వే

ఇవాళ్టి నుంచి తెలంగాణలో పంట నష్టాలపై సర్వే చేయించనుంది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన చేయ‌డం జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని ఇప్పటికీ రైతులు జిల్లాల వారిగా నివేదిక తయారు చేస్తున్నారని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక ఆ నివేదిక అందిన వెంటనే రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని చేస్తానని ఈ మేరకు హామీ ఇచ్చారు.3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.రైతు బంధు నిరంతర ప్రక్రియ అని, మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement