Tuesday, November 5, 2024

TS : ఇవాళ నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ బల పరీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ పదవులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఇటీవల 37 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు సైతం నియమించింది. ఈ క్రమంలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో నేడు డీసీసీబీ చైర్మన్ బల పరీక్ష జరగనుంది.

- Advertisement -

నిజామాబాద్ జిల్లా కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్, డైరెక్టర్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కో ఆపరేటివ్ విభాగం కమిషనర్‌ను కోరారు. వైస్ చైర్మన్ సహా మెజార్టీ సభ్యుల తిరుగుబాటు చేశారు. అవిశ్వాస పరీక్షకు ముందు డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. శిభిరం నుంచి నేరుగా డీసీసీబీకి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి సహా మెజార్టీ సభ్యులు రాబోతున్నారు. ఇక, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శిభిరంలో ఉన్న సభ్యులు కలిశారు. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా జరగనుంది. చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ఖాతాలోకి మున్సిపల్ చైర్మన్ పీఠం వెళ్లనుంది. చైర్మన్ రేసులో ఖాందేష్ సంగీత, వన్నె ల్ దేవి లావణ్య ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement