Sunday, April 28, 2024

TS : బీఆర్ఎస్‌కు వ‌రుస షాక్‌లు… చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా…

బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నారు. ఒక‌రోక‌రుగా బీఆర్ఎస్‌ను నేత‌లు వీడుతున్నారు. తాజాగా ఇవాళ చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.

- Advertisement -

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానన‌ని తెలిపారు. ఇన్ని రోజులు పార్టీలో చేవెళ్ల ప్రజలకి సేవ చేసేoదుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాన‌న్నారు. త‌న రాజీనామా ఆమోదించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఇన్నాళ్లూ త‌న‌కు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement