Wednesday, May 22, 2024

కుండపోత వర్షంలో ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జూలై 21 -: వరద నీటి నుంచి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏమాత్రం ముంపు సమస్య తలెత్తకుండా చూసేందుకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు.

పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులను, సిబ్బందిని ట్యాంక్ బండ్ వద్దకు పిలిపించి వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండా చెరువులోకి మళ్లించేందుకు ఇసుక బస్తాలను అడ్డం వేయించారు. స్వయంగా మంత్రి కూడా సిబ్బందితో కలిసి వర్షంలోనే ఇసుక బస్తాలను వరద నీటికి అడ్డుగా వేశారు. జోరు వానలోను సుమారు రెండు గంటలకు పైగా వర్షంలోనే మంత్రి పనులను పర్యవేక్షించారు. వర్షపు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోతట్టు ప్రాంతాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బి కే రెడ్డి కాలనీ వైపు వెళ్లే నాలాలో ప్రవాహాన్ని కూడా పరిశీలించారు.


మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నరసింహ, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది కూడా మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

ఆగకుండా వర్షం కురుస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం ట్యాంక్ బండ్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనులను పరిశీలించడం చూసిన స్థానికులు… ఇంతలా ప్రజా క్షేమం కోరే నాయకుడు తమకు లభించడం అదృష్టమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement