Saturday, May 4, 2024

Warangal – సీనియర్ ఐపిఎస్ సామాన్య పోలీసింగ్…స్వయంగా సిపి రంగనాధ్ వాహన తనిఖీలు

వ‌రంగ‌ల్ – ఐపిఎస్ అధికారి ఎ.వి.రంగనాధ్ ప్రజా పోలీసింగ్ కి కేరాఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదు. నిత్యం సామాన్యులకు అండగా..సామాన్యుల్లో ఒకడిగా ఉండటానికి ఇష్టపడే ఈ అధికారి ప్రజలకోసం..ప్రజల మధ్యనే పోలీసులు అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు . తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన స్పెషల్ వెహికిల్ చెకింగ్ కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటూ అధికారులు.. సిబ్బందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. సాధారణంగా పోలీసుల వాహనాల తనిఖీ అంటే ఒక రోడ్డుపై ఓ ఇద్దరు ముగ్గురు సిబ్బంది వాహనాలు నిలుపుతూ..చలాన్లు విధిస్తూ వాహనాలను నియంత్రించడం పరిపాటి. కాని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో వాహన తనిఖీల్లో ఎస్ఐ స్థాయి అధికారి నుండి కమిషనర్ స్థాయి అధికారి వరకూ స్వయంగా పాల్గొంటూ నకిలీ పత్రాలతో తిరుగుతున్న వాహనాలే టార్గెట్ గా నిర్వహిస్తున్న డ్రైవ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పోలీసులకు ఆదర్శనీయంగా నిలుస్తోంది.

గత రెండ్రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రంగనాధ్ స్వయంగా పాల్గొంటూ వాహనాల పత్రాలు
తనిఖీ చేయడంతో పాటు రహదారి భద్రత..ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. కమిషనర్ స్థాయి సీనియర్ ఐపిఎస్ అధికారి స్వయంగా రోడ్డెక్కి తనిఖీలలో పాల్గొనడంతో వరంగల్ పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతో విధులు నిర్వహించడమే కాకుండా ..వాహన తని‎ఖీల సందర్భంలో తగిన రక్షణ చర్యలు పాటిస్తూ..రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసింగ్ లో వచ్చిన మార్పులు..పోలీసు అధికారులు..సిబ్బంది ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement