Monday, April 29, 2024

నీట్ లో మెరిసిన విద్యాకుసుమం శివలీల….జ‌డ్పీ హైస్కూల్ లో స‌త్కారం ..

మక్తల్, జూన్ 28(ప్రభన్యూస్) కేవలం ఉన్నత చదువులు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలకే అబ్బుతాయని ఉన్నది అపోహ మాత్రమే అని నిరూపించింది ఓ మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థిని. ప్రాథమిక విద్యాభ్యాసము గ్రామీణ ప్రాంతమైన తన స్వగ్రామంలోని గోలపల్లిలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుకొని ఆరవ తరగతి నుండి మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు తన చదువును కొనసాగించింది. అటు పిమ్మట మక్తల్ పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ పూర్తి చేసింది. అటు పిమ్మట తల్లిదండ్రుల ఆశయ సాధన కొరకు పట్టు సాధించాలన్న లక్ష సాధన తో కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష రాసింది నీటుగా. నీట్ పరీక్షలో 503 ర్యాంకును సాధించి డాక్టర్ సీటు ను సాధించింది.

నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థి. ఆమె ఎవరో కాదు మక్తల్ మండలంలో గోలపల్లి గ్రామానికి చెందిన ఓ గ్రామీణ విద్యార్థి అయినా శివలీల. గోలపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే ఓ రైతు ముద్దుల కూతురు శివ లీల. రైతుకు నలుగురు ఆడబిడ్డలు, ఇద్దరు కుమారులు మొత్తం ఆరుగురు సంతానం. వీరిలో శివ లీల ఆంజనేయులు పెద్ద కూతురు. ఎంతటి కష్టమైనా మేము పడుతాము నీవు చక్కగా చదువుకోవాలని శివలీలను తండ్రి ఆంజనేయులు విద్యాపరంగా తో ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ కోణంలోనే హైదరాబాదులో నీట్ కోచింగ్ కు వేలకు వేలు డబ్బులు కట్టి తన కూతురు చక్కగా చదువులో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంజనేయులు. తండ్రి పడిన కష్టాన్ని చూసిన ఆ విద్యార్థి శివ లీల ఎలాగైనా తాను కష్టపడాలి మంచి ర్యాంకు తీసుకురావాలన్న తపనతో చదువులో అసమాన ప్రతిభ కనబరిచి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే బిడ్డగా నీట్ లో 503 ర్యాంకు సాధించి మెరిసింది శివలీల. తన కోరికను తీర్చిన శివలీలను తండ్రి ఎంతగానో అభినందించాడు.

శివ లీల, తండ్రిని సన్మానించిన ఉపాధ్యాయులు…
మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జిహెచ్ఎం వెంకట వరలక్ష్మి ఆధ్వర్యంలో తమ పూర్వ విద్యార్థి అయిన శివ లీల నీట్ లో 503 ట్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులతో కలిసి శివలీల ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతటితో సరిపెట్టుకోలేక శివ లీల అనే విద్యార్థిని వారి తండ్రి ఆంజనేయులు పాఠశాలకు రప్పించుకుని ఉపాధ్యాయ బృందమంతా ఇరువురిని ఘనంగా సన్మానించి శివ లీల విద్యాపరంగా ఉద్యోగ పరంగా మరింత ఎత్తుకు ఎదగాలని ముందడుగు వేయాలని వారు ఆశీర్వదిం చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం వెంకట వరలక్ష్మి తో పాటు ఉపాధ్యాయులు సుధాకర్, మల్లికార్జున్, అరుణ జ్యోతి, ప్రసన్న కుమారి, రేణుక, స్వప్న, మీరాబాయి, జయశ్రీ, విజయ శ్రీ,, పరంజ్యోతి, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement