Monday, April 29, 2024

ద్వైపాక్షిక సంబంధాలకు నూతన శిఖరాలకు తీసుకెళ్లిన మోడీ అమెరికా పర్యటన.. అసోచామ్

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన భారత్-అమెరికా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళింది. ద్వైపాక్షిక సంబంధాలకు అపారమైన అవకాశాలకు మార్గం సుగమం చేసింది. ఇండో-యు.ఎస్ గ్లోబల్ ఛాలెంజ్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రారంభాన్ని వారు స్వాగతించారు. ఈసంద‌ర్భంగా అసోచామ్ ఏపీ అండ్ తెలంగాణ ఛైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధానమంత్రి పర్యటన, వేగంగా మారుతున్న ప్రపంచ క్రమంలో భారత్-అమెరికా సంబంధాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా పరిగణించబడుతోందన్నారు ఇది సాంకేతిక, శాస్త్రీయ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ సెక్టార్లు పటిష్టతకు, ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక పరాక్రమంతో రెండు దేశాలు అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదగడానికి సహాయపడతాయన్నారు.

యునైటెడ్ స్టేట్స్, భారతదేశం మన ఆర్థిక వ్యవస్థలను డీకార్బనైజ్ చేయడానికి, క్లీన్ ఎనర్జీని అమలు చేయాలనే ఉమ్మడి లక్ష్యం పంచుకుంటాయన్నారు. వాతావరణ భద్రతను బలోపేతం చేయడానికి, పౌర అణుశక్తి శాంతియుత ఉపయోగాలను విస్తరించడానికి, వాతావరణ ఆర్థిక పరిష్కారాలను అన్‌లాక్ చేయడానికి, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీకరించడానికి, భవిష్యత్తు స్వచ్ఛమైన ఇంధన ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన వనరులను సమీకరించడానికి వారు కలిసి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి ఒకరినొకరు సహకరించుకుంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement