Friday, April 26, 2024

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు సిరిసిల్ల‌, ములుగు ఎంపిక : మంత్రి కేటీఆర్

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు సిరిసిల్ల‌, ములుగు ఎంపిక‌య్యాయ‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల క‌లెక్ట‌రేట్ లో జిల్లా స్థాయి అధికారుల‌తో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. సిరిసిల్ల‌, ములుగు జిల్లాల్లో ఫిబ్ర‌వ‌రిలో ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కష్టకాలంలో అవసరమైతే కావాల్సిన సిబ్బందిని నియమించుకునేందుకు వెసులుబాటును స్థానిక అధికారులకు కల్పించామన్నారు.

మెగా పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేయించాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రంలో సిరిసిల్ల ఐదోస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 470 వైద్యబృంటాలు 15లక్షల ఇండ్ల వద్దకు వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జిల్లా ప్రొఫైల్ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మొదటి విడుత దళితబంధు పథగానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ‘మనఊరు-మనబడి ‘లో భాగంగా 510 పాఠశాలలను మూడు సంవత్సరాల్లో ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement