Tuesday, May 7, 2024

WGL: మహిళా ఉద్యోగికి ఎస్సై వేధింపులు… కేసు న‌మోదు

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై జి. అనిల్ ఓ మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురిచేశారు. బాధితు రాలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమేరకు కేసు నమోదైంది.

సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల మార్కె
ట్లో చేపట్టారు. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. ఇదే చోట పోలీసు బందోబస్తు నిర్వహించిన ఎస్సై అనిల్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె చరవాణి నెంబరుకు వాట్సప్ ద్వారా సందేశాలు పంపడం ప్రారంభించారు. ఆమె తన కార్యాలయానికి వెళ్లే సమయంలో తరచూ వెంటపడేవారు. తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పడంతో నమ్మిన ఆమె ఒకరోజు ఎస్సై ఇంటికి వెళ్లింది.

ఈక్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయపడి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత నేను ఎస్సైని.. నాకుఎవరూ ఎదురు చెప్పరు.. చెప్పినట్లు వినాలి’ అంటూ తరచూ బెదిరింపులకు దిగాడు. ఆందోళనకు గురైన ఉద్యోగిని తన భర్తకు విషయం చెప్పింది. ఆయన ఎస్సైని నిలదీశారు. దీంతో అంతు చూస్తానని ఆయన్ను సైతం బెదిరించాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో ఎస్సై అనిల్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మరో కేసు కూడా నమోదైంది. ఎస్సై ఇలా ప్రవర్తించడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. ఈఘటనపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement