Sunday, April 28, 2024

Sharmila: భ‌ట్టిని క‌లిసిన ష‌ర్మిల‌… నా కొడుకు పెళ్ళికి రండి…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ప్రజాభవన్ వైఎస్ షర్మిల క‌లిశారు. కుమారుడి పెండ్లీ కార్డును అంద‌జేశారు. భట్టి అన్నా బాగున్నారా కంగ్రాట్యులేషన్ మీరు డిప్యూటీ సీఎం కావడం నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తెలిపారు.

భట్టి అన్న నా కొడుకు పెళ్ళికి రండి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి వివాహ పత్రికను అందజేశారు. ఈ నెల 18న నా తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదిన జరిగే పెండ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు షర్మిల. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement