Friday, May 10, 2024

త‌న‌దైన స్టైల్లో కేసీఆర్ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ష‌ర్మిల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 68వ పుట్టినరోజు నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కు ప్ర‌ముఖులంద‌రూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ కు తనదైన స్టైల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త రాజ్యాంగం రావాలనుకుంటున్న దొర గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సీఎం కేసీఆర్ కు చురకలంటించారు వైయస్ షర్మిల. “ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, ఉద్యోగాలకోసం చస్తున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా, అప్పుల కుప్పలను గొప్పలుగా చెప్పుకుంటూ, దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకొంటూ, అంబేడ్కర్ రాజ్యాంగం గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్తరాజ్యాంగం రాయాలనుకునే దొరగారూ, మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకోండి” అంటూ షర్మిలా ఎద్దేవా చేశారు.
“రోజుకొక రైతు చస్తున్నా, వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకం మిగిలిస్తున్నా, పంటనష్టపోయి అప్పులపాలవుతూ, కాలికిందున్న భూమి కంటికి కనిపిస్తలేదని, రోజుకో తీరుగ అణిచి వేయబడుతున్నా, జనాలు అరిగోసల పాలవుతున్నా, మీరు రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలె. ఎవడెట్లపోయినా మీరు మాత్రం సల్లంగుండాలె ? ” అంటూ ఫైర్ ష‌ర్మిల‌ అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement