Tuesday, May 7, 2024

రాహుల్ ‘రైతు సంఘర్షణ సభ’: ఏర్పాట్లు పరిశీలించిన సీతక్క

ఈ నెల 6న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో సభలో రాహుల్ పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ రైతుల బాధలు, కష్టాలు చూసి చలించిపోయారని అన్నారు. ఈ నెల 6న ఉద్యమాల గడ్డ ఓరుగల్లులో జరిగే రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళే విధంగా ఈ సభ ఉంటుందన్నారు. రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ ‘రైతు సంఘర్షణ సభ’ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement