Saturday, May 4, 2024

ములుగు జిల్లాలో భారీ వ‌ర్షాలు… అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌న్న సీత‌క్క

ములుగు నియోజక వర్గం లో భారీ వర్షాలు ఉన్నందున గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హెచ్చ‌రించారు. , అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని కోరారు. వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని అన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి రోడ్డు రవాణా,విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement