Saturday, May 4, 2024

HYD: ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య.. ఆర్టీసీ ఉద్యోగుల ధ‌ర్నా

హైదరాబాద్ : న‌గ‌రంలోని ఎల్బీ న‌గ‌ర్ లో ఆర్టీసీ మ‌హిళా కండ‌క్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. హైదరాబాద్ లోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ గా ప‌నిచేస్తున్న‌ గంజి శ్రీవిద్య (48) అనే మహిళా కండక్టర్ అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. బండ్లగూడ డిపోలో శ్రీవిద్య గత 12 సంవత్సరాల నుంచి కండక్టర్ గా పనిచేస్తోంది. ఈనెల 12వ తేదీన శ్రీవిద్య సస్పెన్షన్ కు గురైంది.

దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. మనోవేదనతో బీపీ టాబ్లెట్లు ఎక్కువగా వేసుకుంది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శ్రీవిద్య మృతిచెందింది. ఆమె ఆత్మహత్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎల్ బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అధికారుల వేదింపులతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement