Wednesday, May 1, 2024

దిన‌స‌రి కూలి దిగాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో ఎక్కడ చూసినా దినసరి కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయా రైంది. సాలీనా పని దొరకక వారిపై ఆధారపడిన కుటుంబాలు అర్ధాకలితోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం, పారిశ్రామికం, సేవారంగం.. ఏదైనా అసంఘటిత రంగంగానే మారిపోయింది. తొంభై శాతం కార్మిక చట్టాలు కేంద్ర ప్ర భుత్వ ఆధీనంలో ఉండడంతో రాష్ట్రాలు వారి నిత్య జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దినసరి కూలీలు దిగాలు చెందు తూనే ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఊళ్ళు విడిచి వలస బాట పట్టినా పొట్టనిండని దుర్బిక్షం వారిని వెంటాడుతోంది. దేశంలో వ్యవసాయ భూమితో పాటు ఇతర చర, స్థిరాస్తులేమీ లేని నిరుపేద కార్మికుల కుటుంబాల సంఖ్య పద్నాలుగు కోట్లను దాటి ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ కార్మికుల జీవన విధానం అంతకంతకూ దిగజారుతోంది. రోజు రోజుకు పడిపోతున్న వాస్తవ వేతనాలు వారిని కృంగదీస్తున్నాయి.

ఇటీ-వల కేంద్ర ప్రభుత్వ సమర్పించిన 2022-23 ఆర్థిక సర్వేలో, గ్రామీణ శ్రామికులకు సంబంధించిన దిగ్భాంతికి గురిచేసే అంశాలు అనేకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన ఆర్థికవేత్తలు దృవీకరించిన లెక్కల ప్రకారం, గ్రామీణ శ్రామికుల వాస్తవ వేతనాలు గత రెండేళ్ళ నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. అంటే ద్రవ్యోల్బణానికి సర్దుబాటు- చేయబడిన వేతనాలు కార్మిక వర్గానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. అధికారిక తెక్కల ప్రకారం గ్రామీణ భారతదేశంలో దాదాపు 36.5 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. ఇది దాదాపు పదేళ్ళ క్రితం నాటి జనాభా లెక్కల సమాచారం. సామాజిక నిపుణులు చెబుతున్న వాస్తవ లెక్కల ప్రకారం ఈ సంఖ్య 42 కోట్లు దాటి ఉంటుంది. వీరిలో 61.5 శాతం మంది వ్యవసాయంలో, 20 శాతం పరిశ్రామిక రంగంలో, 18.5 శాతం మంది సేవా రంగంలో పనిచేస్తు న్నారు. వారి కుటు-ంబ సభ్యులను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య మూడు నుంచి నాలుగు రెట్లు- పెరుగు తుంది. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా దినసరి కార్మికులకు నిజ వేతనాలు రోజు రోజుకు తగ్గుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది దారుణమైన పేదరికానికి దారితీసే ప్రమాదాన్ని సూచిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయ శ్రామిక శక్తిలో చిన్న రైతులు కూడా ఉన్నారు, వారు అతి తక్కువ భూమిని కలిగి ఉంటారు. పేరుకు రైతే కాని ఉన్న భూమితో కుటుంబ సభ్యులను పోషించుకోని దుస్థితి. గత ట్రెండ్‌లను బట్టి చూస్తే, దినసరి కార్మికుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూ వస్తోంది. లక్ష లాది మంది సన్నకారు, చిన్న రైతులు కూడా తరచుగా కూలీ పనుల మీద ఆధారపడటం వల్ల ఈ సంఖ్య పెరుగుదలకు కారణమవుతోంది. వారంతా తమకున్న తక్కువ భూముల్లో తగినంత రాబడి రానం దువల్ల ఇతరుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పనులు ఏడాదంతా ఒకే రకంగా ఉండవు. కొన్ని నెలల్లో అసలు పనులే ఉండవు. ఈ తరహా కూలీలంతా గ్రామాల్లో తరచూ సామాజిక అణచివేతకు గురవుతున్నారు. ఈ కార్మికులలో ఎక్కువ మంది షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఉన్నందునే ఆర్థిక సమస్యలు జటిలమవుతున్నట్లు ఆర్థిక సర్వేలో స్పష్టమైంది.

- Advertisement -

2022 అక్టోబర్‌లో పురుషులకు రోజువారీ వేతనం రూ.364 కాగా, మహిళలకు రూ.271. అంటే పురుషులకు నెలకు రూ.11,000, మహి ళలకు రూ.8,000. మే 2020తో పోల్చితే, ఈ వేతన రేట్లు- పురుషులకు 17శాతం, మహిళలకు 12శాతం పెరుగుదల కనిపిస్తోంది. కానీ ఈ పెరుగుదల భ్రమ మాత్రమేనని నిపుణులంటు న్నారు. ఆ నిర్ధేశిత కాలంలో ధరల పెరుగుదలను లెక్కల్లోకి తీసుకొని చూస్తే నిజమైన వేతనాలు వాస్తవానికి పడిపోయాయి. పురుషులకు, నిజమైన వేత నాలు రోజుకు రూ.207 నుండి రూ.204కి స్వల్పంగా తగ్గగా, మహిళలకు రోజుకు రూ.160 నుండి రూ.152కి పడిపోయింది. ఈ ఆదా యాలు సంవత్సరం పొడవునా ఉండవు. సంవత్సరంలో నిర్దిష్ట సమ యాల్లో మాత్రమే వ్యవసాయ పని అందుబాటు-లో ఉంటు-ంది. సరా సరిగా ఒక వ్యవసాయ కార్మికుడికి ఒక సంవత్సరంలో 3 నుంచి 4 నెలలు మాత్రమే వ్యవసాయ పని దొరుకుతోంది. దీంతో బతుకు దెరువు కోసం మిగతా సమయాల్లో వ్యవసాయేతర పనులు చూసుకో వాల్సి వస్తోంది. వ్యవసాయేతర పని, ఒక వ్యక్తి పార్ట్‌-టైమ్‌ ప్రాతిపది కన ఏకకాలంలో 3 నుంచి 4 వృత్తులను చేయవలసి వస్తోంది.

వైద్యం, విద్య, పిల్లలకు పౌష్టికాహారం ఇప్పటికీ దూరమే..
మందగిస్తున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యం, విద్య, పిల్లలకు పౌష్టికాహారం వంటి వాటికి కార్మికుల కుటుంబాలు నానాటికీ దూరమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో సంక్షేమ కార్యక్రమాలను ప్ర భుత్వాలు ఉపసంహరించుకోవడం లేదా కోత పెట్టడం వల్ల ఈ కుటు-ంబాలు అప్పుల పాలవుతున్నాయి.

వారి సంపాదన ప్రైవేట్‌ వైద్యులు, ప్రైవేటు- పాఠశాలలకు చెల్లించడానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. కుటు-ంబంలో ఎవరి-కై-నా తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లయితే ఆ కుటు-ంబం, బంధువులు, స్నేహితులు లేదా వడ్డీ వ్యాపారుల నుండి రుణం తీసుకోవాల్సి వస్తోంది. మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ స్టాటిస్టికల్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ కుటు-ంబాలకు సంబంధించిన చివరి సర్వేలో 50శాతం వ్యవసాయ కుటు-ంబాలు అప్పుల పాలవుతున్నాయని తేలింది. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ కార్మికులకు, ఇతరులకు కూడా జీవనాధా రాన్ని అందిం చాల్సిన లక్ష్యాన్ని చేరనుకోలేకపోతోంది. అందుబాటు-లో ఉన్న తాజా లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు 8.19 కోట్ల మంది మాత్రమే ఇప్పటి వరకు ఈ పథకం కింద పనిచేశారు. భూమిలేని కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతర గ్రామీణ కార్మికులు ఈ పథకాన్ని ఆశ్రయించడం అవశ్యమైనప్ప్‌ టికీ ఆశించిన ప్రయోజనం పొందలేక పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వలన కూలీల పనికి డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో కుటుం బాల పోషణ కోసం కోట్లాది మంది అదే దారిని ఎంచుకోక తప్పడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement