Thursday, May 2, 2024

Breaking: పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్​ ఆపి క్షతగాత్రులకు హెల్ప్​ చేసిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్​ ఖమ్మం రూట్​లో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరిగింది. అయితే అదే రూట్​లో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు యాక్సిడెంట్​ని చూసి తన వాహనం ఆపించారు. యాక్సిడెంట్​లో గాయాలైన వారి దగ్గరకు వెళ్లి వారికి సాయం చేశారు. తన సిబ్బంది సాయంతో తన కాన్వాయ్​లోని మరో వాహనంలో హాస్పిటల్​కి తరలించి సత్వరమే వైద్యం అందేలా ఫోన్​ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మునుగోడు పర్యటన నుంచి వస్తూ.. పర్వతగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొని హనుమకొండకు వెళ్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాగా, వరంగల్ – ఖమ్మం రహదారిలోని పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే మంత్రి తన కాన్వాయ్ ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. తన సిబ్బంది ద్వారా గాయపడిన వ్యక్తిని వెంటనే తన కాన్వాయ్ లోని మరో వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ వలపదాసు చంద్రశేఖర్ కు ఫోన్ చేసి ఆ క్షతగాత్రుడికి తక్షణమే మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ యాక్సిడెంట్​లో గాయాలైన వ్యక్తి పంథినికి చెందిన రమేశ్ గా గుర్తించారు. మంత్రి ఔదార్యాన్ని అక్కడున్న వాళ్లంతా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement