Wednesday, May 8, 2024

Revanth Reddy: ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో అభ్య‌ర్థుల త‌రుపున ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలకు రేవంత్ హాజరుకానున్నారు.

ఉదయం నారాయణపేట బహిరంగ సభ, దేవరకద్ర బహిరంగ సభ, మ‌ధ్యాహ్నాం మహబూబ్ నగర్ బహిరంగ సభ, రాహుల్ గాంధీతో కామారెడ్డి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం పఠాన్ చెరులో జరిగే బహిరంగ సభ, శేరిలింగంపల్లి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement