Thursday, May 2, 2024

Recorded Rainfall – ఇంత వరద నా జీవితంలో చూడలేదు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజ‌మాబాద్ – ఇంత పెద్ద వర్షం తన జీవితంలో నిజాంబాద్ ప్రాంతంలో చూడలేదని రాత్రి తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని. నిజాంబాద్ జిల్లాలోనే ఐదు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ముఖ్యంగా తన నియోజకవర్గమైనటువంటి బాల్కొండ ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయిందని గతంలో ఆంధ్ర ప్రాంతంలో వరదలు రోడ్లపై నేటి ప్రాంతం చూసామని నేడు వేల్పూర్ లోనే అటువంటి సంఘటన చూడటం దురదృష్టకరమని రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ లో రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం మూడు గంటలకు నిలిచిందని కొద్ది సమయంలోనే 46 సెంటీమీటర్ల వర్షం పడడంతో పరిస్థితులు చే దాటాయని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేమున్నాం అన్నిటిని చూసుకుంటాం ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా అవసరమైన చోట విడిసి సభ్యులు సహాయక చర్యలు చేపట్టాలని వారు పనులు చేపట్టిన డబ్బు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నదృష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అందరూ ఉదయం నుండే నాతో పాటే పరిస్థితులను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. పల్లపు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు గ్రామపంచాయతీలో ఇతర భవనాల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేశామని వారికి భోజన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నీటి ప్రవాహం ఇప్పటికే ఎక్కువగా ఉందని నీటి ప్రవం తగ్గిన వెంటనే మరమ్మతులన్నీ చేపట్టి ఇబ్బందులు కలక్కుండా చూసే బాధ్యత తనదేనని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.

మదర్స లో ఉన్న పిల్లలను బయటకు తీసుకు వచ్చామని ప్రభుత్వం తరఫున తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని రాబోయే రెండు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్లడం నీటి ప్రవాహం నుండి రోడ్లు దాటే ప్రయత్నాలు కూడా చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆయన వెంట జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర కాకుండా సహాయక చర్యలు చేపట్టే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి వర్షము నుండి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement