Monday, May 6, 2024

Vikarabad – 15న మెడిక‌ల్ క‌ళాశాల ప్రారంభం… ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

వికారాబాద్, సెప్టెంబర్ 13 ( ప్రభ న్యూస్):: వైద్య కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా కళాశాల పరిసర పరిసరాలను, సమావేశం నిర్వహించే ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక ఏర్పాటుతోపాటు ఫర్నిచర్, త్రాగునీరు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో వీధిలైట్లు వీధి దీపాలను అమర్చాలని సూచించారు. కళాశాలకు మిషన్ భగీరథ నీటిని అందించేలా అలాగే నీటి సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఉండే వసతి గృహాల్లో విద్యుత్తు, బాత్రూంలు, టాయిలెట్స్, త్రాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా సమకూర్చాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల తాగునీరు అవసరాల కోసం ఆర్ఓ ప్లాంటేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ తో పాటు వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మమాలిని, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డీఎస్సీడివో మల్లేశం, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలపతిరావు, డిఇ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement