Friday, May 3, 2024

MDK: సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హుస్నాబాద్ పర్యటనలో ఉన్నారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయంను మంత్రి సందర్శించి స్వామి వారిని దర్శించుకుని, రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.

ఈసందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ నిఖార్సయిన హిందువు అన్నారు. రూ.1200 కోట్లతో యాదాద్రి టెంపుల్ ను అభివృద్ధి చేశారన్నారు. 600 కోట్ల రూపాయలతో కొండగట్టు అభివృద్ధి చేస్తున్నారన్నారు. అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. 10,000 దేవాలయాల్లో దూప దీప నైవేద్యం కోసం రూ.6000 వేలను రూ.10, 000కు పెంచి ఇస్తున్నామన్నారు. పోట్లపల్లి గ్రామంలో 140 దేవాలయాలు ఉన్నాయనే వాళ్ళు అలాంటి గ్రామంలో రూ.40లక్షలతో రామాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

  • శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానన్నారు. కేసీఆర్ కు ఉన్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుంచి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయన్నారు. ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం.. ఇవాళ రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చింది కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement