Saturday, May 4, 2024

Vikarabad: ఎమ్మెల్యే ఆనంద్ అభ్యర్థిత్వం పట్ల వీర శైవ సమాజం హర్షం

వికారాబాద్, ఆగస్టు 22(ప్రభ న్యూస్): ముఖ్యమంత్రి ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో వికారాబాద్ జిల్లా కేంద్రంకు చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఉండడం పట్ల వికారాబాద్ వీరశైవ సమాజం సభ్యులు కలిసి స్వీట్ తినిపించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం అధ్యక్షులు అప్ప విజయకుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆనంద్ మరోసారి విజయం సాధించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర శైవ సమాజం నాయకులు వీరేశం బుచ్చప్ప, కేటి సంగప్ప, విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement