Tuesday, April 30, 2024

ఇదేం న్యాయం.. దూరం ఒక్కటే.. రేట్లే అధికం.. ఆర్టీసీ ఎండీకి ప్రశ్న

శంకరపల్లి (ప్రభ న్యూస్) : ప్రయాణదూరం నాలుగు కిలోమీటర్లు, మెట్రో బస్సులో 30 రూపాయలు, పల్లె వెలుగులో పది రూపాయలు వసూలు చేస్తున్న ఆర్టీసీ, శంకర్పల్లి నుండి మోకిల నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగు కిలోమీటర్ల దూరానికి మెట్రో బస్సులో 30 రూపాయలు వసూలు చేస్తే పల్లె వెలుగు బస్సుకు పది రూపాయలు వసూలు చేస్తున్నారు.

శంకర్పల్లి నుండి మహిదిపట్నం 34 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్టు ధర 45 రూపాయలు అంటే నాలుగు కిలోమీటర్లకు 30 రూపాయలు, 34 కిలోమీటర్లకు 45 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగులు మెట్రో బస్సులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 15నిమిషాలకు ఒకటి మెట్రో బస్సు ఉండగా, తక్కువ ధర వసూలు చేస్తున్న పల్లె వెలుగు బస్సులు రోజుకు నాలుగు మాత్రమే ఉంటాయి. ప్రయాణ దూరం ఒక్కటే కానీ, టికెట్టు ధరలో ఉన్న భారీ వ్యత్యాసాన్ని సరిచేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement