Thursday, May 2, 2024

కాంగ్రెస్, బిజెపి నాయకుల వేసిన రోడ్డు లు కనిపించడం లేదా – మున్సిపల్ చైర్మన్ కొందూటి

షాద్ నగర్ జూలై 26 ప్రభ న్యూస్ పాత జాతీయ రహదారి విస్తరణకు, పరిగి రోడ్డు మరమ్మతులకు సంబంధించి అన్ని నిధులు ఎమ్మెల్యే సహకారంతో మంజూరయ్యాయని, కేవలం వర్షాల కారణంతోనే రోడ్ల నిర్మాణం ఆలస్యం అవుతుందని మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ తెలిపారు. బిజెపి కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో వేసిన రోడ్లు కనిపించడం లేదని ప్రశ్నించారు అభివృద్ధి కాంగ్రెస్ హాయం కంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల అభివృద్ధి బాగా జరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓర్వలేకనే కాంగ్రెస్ బిజెపిలో ఇలాంటి చౌకబార్ నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు.

పాత జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి రహదారిని మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ల విస్తరణకు, మరమ్మతులకు లకు కావాల్సిన అన్ని నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి తెలిపారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement