Saturday, November 9, 2024

RR: సేవతో మేడ్చల్ కు మంచిపేరు తేవాలి.. మల్లారెడ్డి

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్ ఆగస్ట్ 10: వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మంచి సేవ చేసి మేడ్చల్ జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ లను ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లాలో 131 మంది గ్రామ సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు లభించటం మన అదృష్టమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement