Saturday, October 12, 2024

దేవశుని శాపం

మహాభారతం శాపాలతోనే ప్రారంభమయ్యింది. అది శమంత పంచకం. పరశురామ ప్రభువు రాజుల వధించి స్రవించిన రక్తాన్ని అయి దు మడుగులు కావించాడు. ఆ రక్తంతో పితృ తర్పణం చేసి శాంతించాడు. ఆ కారణంగా అది శమంతక పంచకం అయ్యింది. అది కురుక్షేత్రంలో ఒ క ప్రాంతం, అక్కడ పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దీర్ఘ సత్ర యా గం నిర్వహంచాడు.
”ప్రతిహత శత్రు విక్రముఁదు పాండవ వంశ వివర్ధనుండు సు
వ్రతుఁడు పరీక్షిదాత్మఁజుడవద్య విదూరుఁడు దారకీర్తిని
ర్మితవి విధాధ్వరుండు జనమేజయుఁడన్‌ జనపాలుఁదుత్తమ
స్తుతమతి దీర్ఘ సత్రమజితుండొనరించె శుభాభికాంక్షియై”
– ఆం. మ.భా., ఆ.ప., ప్ర.అ.83ప.
బలవిక్రమాలు, పుణ్యగుణాలు ప్రోగు పోసినట్లున్నవాడు జనమేజ యుడు. శ్రేయస్కాముడై దీర్ఘ సత్ర యాగాన్ని నిర్వహంచాడు. యాగ ప్రదే శంలో సరమ అనే దేవశుని కుమారుడు సారమేయుడనే వాడు క్రీడార్థం గా వచ్చి తిరుగుతున్నాడు. జనమేజయుడి తమ్ములు ఉగ్రసేనా దులు ఆ సారమేయుడిని దండించారు. అది అరుస్తూ దు:ఖిస్తూ సరమ దగ్గరకు వెళ్లి తనను వారు కొట్టిన విషయం చెప్పింది. అపుడా తల్లి తల్లడిల్లి మిక్కిలి కోపంతో జనమేజయుడి దగ్గరకు వెళ్లి ఇలా పలికింది. ”నీ తమ్ములు అతి దయారహతులు. అత్యంత వివేక విదూరులు. నా బిడ్డ కడు పసివాడు. నిరపరాధి. అట్టి అతడిని దండించారు. ఓ రాజా!
”తగునిది తగదని యెదలో
వగవక సాధులకుఁబేదవారలకెగ్గుల్‌
మొగిఁజేయు దిర్వినీతుల
కగు ననిమిత్తాగమంబులయిన భయంబుల్‌”
– ఆం. మ.భా., ఆ.ప., ప్ర.ఆ., 86 ప.
అని శపించింది. వెంటనే కుమారుడితో కూడా అదృశ్యమయ్యింది. అది దేవతల శ్వాసం. నిగ్రహానుగ్ర హసమర్థ, సాధువుల్ని, బడుగుల్ని అకారణంగా బాధించేవారికి నిర్హేతుకంగా భయాలు సంభవిస్తాయన్నది. ఏ కారణం లేకుండానే భీతి వెంబడిస్తుంది. యాగాన్ని పూర్తి చేసిన జనమే జయుడు దేవశుని వచనానికి ప్రతీకారం చేయడానికై శాంతికపౌష్టిక క్రియ లు నిర్వహంచే పురోహతుడి కోసం తిరగని ఆశ్రమం లేదు- భయం వెంబ డిస్తుండగా, ఎట్టకేలకు శ్రుత శ్రవసుడి పుత్రుడిని సోమశ్రవసుడిని పురోహ తుడుగా వరించి శాంతిక పౌష్టిక క్రియలు నిర్వహంచాడు.
అప్పుడే ఉదంకుడు రావడం తక్షకుడు పరీక్షిత్తుకు, తనకు చేసిన అపకారం చెప్పడం, సర్పయాగాన్ని నిర్వహంపజేయడం, అది మధ్యలో నే ఆస్తీకుడి వల్ల అగడం మొదలైన కార్యనిర్వహణ భారమంతా మోయవ లసి వచ్చింది. ఇవే అనిమిత్తాగమాలయిన భయాలు, మహారాజు భయ పడి కంపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement