Saturday, September 7, 2024

Exclusive | బడిపంతులు ఇంట్లో అందరూ ఉన్నత స్థాయి ఉద్యోగులే.. స్ఫూర్తిగా నిలుస్తున్న కుటుంబం

ఆయ‌నో బ‌డిపంతులు.. క‌ఠిన నిబంధ‌న‌లు, బాధ్య‌త‌గా మెల‌గ‌డం వంటి వాటిని ఆయ‌న పిల్ల‌ల‌కు అల‌వాటు చేశారు. ఏదైనా సాధించాల‌న్న త‌ప‌న ఉండ‌డ‌మే కాదు, దాన్ని సాకారం చేసుకోవాల‌న్న సంక‌ల్పం కూడా ఉండాలంటారు. దీంతో ఆయ‌న కుటుంబంలోని న‌లుగురు పిల్ల‌లు కూడా ఇప్పుడు ఉన్న‌త ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. చివ‌రికి ఆయ‌న చిన్న కూతురు నిన్న ప్ర‌క‌టించిన తెలంగాణ ఎస్సై ఫ‌లితాల్లో ఉత్త‌మ ర్యాంకు సాధించింది. ఆ బ‌డి పంతులు కుటుంబం తీరు నేటి త‌రానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

– ప్ర‌భ‌న్యూస్‌, శంక‌ర్‌ప‌ల్లి

రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఉంటున్న తలారి సంజీవరావు చిన్న కుమార్తె తేజశ్రీ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకుతో సెలెక్ట్ అయ్యింది. ఆ కుటుంబంలోని నలుగురు పిల్లలు ఇద్దరు డాక్టర్లుగా, మ‌రొక‌రు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, ఇంకొక‌రు కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఈ కుటుంబంలోని వారంతా ఉన్న‌త ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ‌డంపై చాలామంది అభినందిస్తున్నారు. ఒక బడి పంతులుగా ఆయన కఠోర పరిశ్రమ, సామాజిక బాధ్యత, కలగలిపి కుటుంబంలో ఉత్తమ ఫలితాలు రాబట్టుకోగలిగార‌ని పలువురు అభిప్రాయపడ్డారు.

తండ్రి పడుతున్నకష్టాన్ని ఎప్పటికప్పుడు పిల్లలు గమనించుకుంటూ తమ జీవితాలను ఉన్నత స్థానాలలో నిలబెట్టుకోవడం ఆదర్శవంతమైన తీరు అని పలురు అంటున్నారు. ప్రస్తుతం అవిశ్రాంత ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న సంజీవరావుకు ఆయనతో పాటు కలిసి పని చేసిన ఉద్యోగులందరూ అభినందనలు తెలుపుతున్నారు. గొప్ప ల‌క్ష్యం, ఏదైనా సాధించాల‌న్న త‌ప‌న ఉంటే ఫలితాలు వాటంత అవే వస్తాయని ఆ కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని పలువురు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement