Tuesday, April 30, 2024

ఆర్టీసీ బ‌స్సు.. ఆటో ఢీ.. ఆటో డ్రైవ‌ర్ మృతి

వికారాబాద్ టౌన్ ( ప్రభ న్యూస్) .. ఆర్టీసీ బ‌స్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆటో డ్రైవ‌ర్ మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న జిల్లా కేంద్రంలోని ఎస్ ఏపీ కాలేజీ వద్ద చోటు చేసుకుంది. కాగా బస్సు తాండూర్ డిపో నుండి వికారాబాద్ వస్తుంది. ఆటో వికారాబాద్ నుండి అనంతగిరి రూట్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆటో డ్రైవర్ శ్రీను. అక్కడికక్కడే మృతి చెందినాడు. ఆటో డ్రైవర్ సొంత గ్రామం థరూర్ మండల్ ఎబ్బనూర్.గ్రామం అని సమాచారం ..పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement