Friday, December 8, 2023

శంకర్ పల్లిలో మైనర్ బాలిక పై అత్యాచారం.. కేస్ బుక్ చేసిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) శంకర్ పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన మియాఖాన్ గడ్డ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది, మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కు చెందిన వివరాలు మోకిల ఇన్స్పెక్టర్ నరేష్ అందించిన సమాచారం మేరకు ఈ క్రింది విధంగా ఉన్నాయి, మియాఖాన్ గడ్డ పరిధి లోని ఎస్సీ కాలనీలో నివాసముండే తూర్పు శ్రీకాంత్ వయసు 24 సంవత్సరములు హిమాయత్ నగర్ నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి (మియా ఖాన్ గడ్డ)కు వచ్చిన వరసకు బంధువైన మైనర్ అమ్మాయి పై ఒంటరిగా ఉన్న సమయాన్ని అదునుగా చేసుకొని ఇంటి వెనుక భాగం నుండి వచ్చి ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందినదని మొకిల ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు ఫిర్యాదుదారులు అందించిన సమాచారం మేరకు ipc సెక్షన్ 376 మరియు పోక్సో 3&4 యాక్టు ప్రకారము కేసు బుక్ చేయడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement