Friday, May 3, 2024

మున్సిపల్‌ కార్మికులకు దుస్తుల పంపిణీ..

ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ కార్మికులకు చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ దుస్తులను పంపిణీ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు, పంప్‌ ఆపరేటర్స్‌, ఎలక్ట్రీషియన్‌ లకు మరియు అటెండర్‌లకు చైర్‌పర్సన్‌ పావనియాదవ్‌, కమీషనర్‌ వసంత చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్‌-19 నిబంధనలు పాటించాలని. వ్యాక్సిన్‌ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ పలుగుల మాదవరెడ్డి, కౌన్సిలర్‌లు చందుపట్ల వెంకట్‌రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారి ఆంజనేయులుగౌడ్‌, కడపోల్ల మల్లేష్‌, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, ఇంజనీర్‌ గుణారెడ్డి, బొక్క విష్ణువర్దన్‌రెడ్డి, సిరాజ్‌, పి. విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement