Monday, April 29, 2024

మునగ ఆకుతో ఆరోగ్యానికి మేలు..

యాచారం : మునగ ఆఖు తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. మునగాకును ప్రతి రోజు ఆహారంలోభాగంగా చేసుకోవడం వల్ల మహిళలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాలి. అంతేకాకుండా అనేక రోగాలను మునగాకుతో నయం చేసుకోవచ్చు. గర్బశయంలో వచ్చే కంతుల సైజును తగ్గించడంలో మునగుకు కీలక పాత్ర వహిస్తుందని మహిళలు గర్బం దాల్చినప్పుడు మునగుకును ఖచ్చితంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెపుతు ఉంటారు. మునగుకుల్లో, మునుగ పువ్వుల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుందని వీటి వల్ల ఎలాంటి ఇన్స్‌ఫెక్షన్‌లు రాకుండా ఉంటాయని అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతు జ్వరం, జలబ్బు వంటివి రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. జలబ్బుతో బాధపడే వాళ్లు మునగకుతో తయారు చేసే సుప్పును తీసుకోవడం వల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుందని అంతేకాకుండా శ్వాసకోస సంబంద సమస్యలను కూడ తొలగిస్తుంది. మునగకును వారానికి మూడు సార్లు అయిన తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్తాయిని నియంత్రిచ్చవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే విధంగా మునగుకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముటిమలు, నల్లమచ్చలు, తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. కావున ప్రతి ఒక్కరు మునగుకును తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement