Sunday, April 28, 2024

RR: ఫిబ్రవరి 2న వికారాబాద్‌కు కేటీఆర్ రాక

వికారాబాద్, జనవరి 31 ( ప్రభ న్యూస్): బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి రెండున వికారాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నట్టు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.

ఫిబ్రవరి రెండో తేదీన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న వికారాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి వికారాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, పాల్గొనాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement