Friday, September 22, 2023

ACB అదుపులో జల్ పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్

రంగారెడ్డి జిల్లా పరిధిలోని జల్ పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ ఏసీబీ అదుపులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కార్యాలయం, నివాసం సహా ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు, నగలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జీపీ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement