Monday, April 29, 2024

సినీ ఫక్కీలో చోరీ

వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన జోగు అంజయ్య కుటుంబంలో పొలం వద్ద నివాసముంటున్నది. అర్ధ‌రాత్రి మంకీ క్యాప్ పెట్టుకొని వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అంజయ్య ఇంట్లోకి చొరబడ్డారు.

తుపాకీతో బెదిరించి ఆయన భార్య అలవేలు ఒంటిపై ఉన్న పుస్తెల తాడును లాక్కున్నారు. బీరువాలో ఉన్న బంగారం సహా మొత్తం 4.5 తులాలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement