Saturday, May 18, 2024

చిన్నారుల తల్లిదండ్రులలో ఉత్సహం నింపాలి..

కందుకూరు : వంట పోటీలతో పాటు పలు రకాల పోటీలు పదే పదే నిరహించి చిన్నారుల తల్లిదండ్రులలో ఉత్సహం నింపాలని ఆగర్మియగూడ గ్రామ సర్పంచ ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి అంగన్‌వాడీ టీచంకు సూచించారు. అంగన్‌ వాడి కేంద్రంలో వారం రోజులపాటు పోషక పక్షం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల జంటలకు వంటల పోటీలు నిరహించడం జరి గింది. వంట పోటీలలో పాల్గొన్న జంటలను సర్పంచ అభినందించి, వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంగన్‌ వాడి కేంద్రంలో ఇచ్చే పోషక పదార్థాలు నాణ్యతతో కూడినవని, బాలింతలు, గర్భిణీలు తప్పక తీసుకోవాలని తెలిపారు. పోటీలలో పాల్గొన్న జంటలు సన, లావణ్య నర్సింహ, అఖీల – జైకాంతరెడ్డి, రాణి -భాస్కంరెడ్డి, స్వర్ణ – ఖాదం, ఆజీమ – ఆధిప్‌ పాల్గొన్నారు వీరి చేత రక్త హీనతను అరికట్ట టానికి తినవలసిన ఆహారం తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్‌, లక్ష్మమ్మ, స్కూల్‌ టీచం వరలక్ష్మి, అంగన్‌వాడి టీచం బాలమణి, ఆయా అంజమ్మ, తల్లులు, కిషోర, బాలికలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement