Thursday, May 9, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువతి హల్ చల్…

శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ యువ‌తి హ‌ల్ చ‌ల్ చేసింది. శుక్ర‌వారం రాత్రి విమానాశ్రయంలో శ్వేత అనే యువ‌తి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డింది. ఇది గ‌మ‌నించిన సీఐఎస్ ఎఫ్ అధికారులు యువ‌తిని ర‌క్షించారు. భ‌ర్త‌ విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేత‌తో క‌లిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగానే యువ‌తి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement