Tuesday, January 25, 2022

కీచక హెచ్ఎం ను సస్పెండ్ చేయండి

ములుగు (ప్రభ న్యూస్) : అటెండర్ భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన పాఠశాల హెచ్ఎం ను సస్పెండ్ చేయాలనీ వైయస్సార్ టిపి రాష్ట్ర కోఆర్డినేటర్ అన్న తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపూర్ మండలం లోని రామంజాపూర్ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ను విధుల నుండి వెంటనే తొలగించాలని అన్నారు. రామానుజపురం ఆశ్రమ పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజు ఇటీవలే వివాహం చేసుకొని రామంజాపూర్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుని అటెండర్ రూమ్ కోసం సంప్రదించాడనీ,ఈ క్రమంలో అటెండర్ భార్యపై కన్నేసిన హెచ్ఎం ,అటెండర్ భార్యని వంట సామాన్లు ఇస్తానని అమ్మాయిని స్టోర్ రూమ్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయులు ఇలాంటి ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి సదరు కీచక హెచ్ ఎం నీ సస్పెండ్ చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News