Saturday, May 4, 2024

Rains – ముసురులో భాగ్యనగరం – నిజామాబాద్ , మెదక్‌ జిల్లాల్లో కుంభవృష్టి

హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ ,, మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి.

ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం వస్తున్నది. ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లిలో వాన దంచికొడుతున్నది. అత్యధికంగా డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. గాంధారి, సిరికొండ మండలంలోని చీమనుపల్లిలో 12 సెం.మీ, సదాశివనగర్‌ జుక్కల్‌, జక్రాన్‌పల్లిలో 11 సెం.మీ, డిచ్‌పల్లి, మదన్‌పల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

. ఇక భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.కాగా, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారుఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement