Monday, May 6, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం – మూడు రోజులపాటు వర్షాలు

హైదరాబాద్ – బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ , ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement