Saturday, May 4, 2024

ప్రారంభమైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మీడీ (వాల్మీకాపురం) గ్రామంలో గుట్ట పైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ప్రారంభమైంది.

అలాగే శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారిని హోమ గుండానికి సంప్రదాయబద్ధంగా మంత్రి ఎర్రబెల్లి ఆహ్వానించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది..

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, కోడూరు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీప్రసన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పూజారులు రుత్వికులు వేద పండితులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

.మరికొద్ది సేపట్లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది ఆ తరువాత ఆలయం ప్రారంభమవుతుంది ఆలయానికి భక్తులని దర్శనార్థం అనుమతిస్తారు తదనంతరం మంత్రులు పుర ప్రముఖులు అందరి సమక్షంలో దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారాల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత తీర్థప్రసాదాలు అందచేస్తారు.ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత పాలకుర్తి గ్రామాలలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement