Sunday, May 5, 2024

Big Breaking: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరబాద్​లోని పలు ప్రాంతాల్లో ఇవ్వాల (గురువారం) సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మోస్తరు జల్లులతో ప్రారంభమైన వాన.. కుండపోతగా మారింది. ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది.

హైదరాబాద్​లోని కూకట్‌పల్లి, హైదర్​నగర్, మూసాపేట, అల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్​రావు నగర్, బాచుపల్లి, ప్రగతినగర్​లో భారీ వర్షం పడుతోంది. వర్షం రాకతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు స్మార్ట్​ ఫోన్​ యూజర్లకు మెస్సేజ్ ద్వారా అలర్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement