Sunday, May 5, 2024

Big Breaking: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్​లోని కూకట్‌పల్లి, హైదర్​నగర్​, మూసాపేట, అల్విన్​ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్​రావు నగర్​, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్​లో వర్షం పడుతోంది.

మేడ్చల్​ జిల్లా కీసర, ఘట్​కేసర్​ మండలాల్లోనూ వర్షం పడుతోంది. వాన రావడంతో వాహనదారులు ఎక్కడికక్కడే షల్టర్లను చూసుకుని ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. వర్షానికి సంబంధించి జీహెచ్​ఎంసీ అధికారులు స్మార్ట్​ఫోన్లకు మెస్సేజ్​ ద్వారా అలర్ట్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement