Sunday, April 28, 2024

TS : జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత

మేడారం బృందంః ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రత్యేక చొరవతో జిల్లా పంచాయతీ విభాగం ద్వారా జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆలయ ప్రాంగణంతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే సెక్టార్లు, 4 వేలమంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి పరిశుభ్రంగా ఉంచుతూ మేడారం పరిసరాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి భక్తులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నారు.

- Advertisement -

కాగా, మంగళవారం మేడారం శ్రీ సమ్మక్క… సారాలమ్మ మహజాతర అమ్మవార్లను దర్శించుకునే ఆలయ ప్రాంగణం ముందు భాగంలో పారిశుధ్యం కార్మికులు పరిశుభ్రం చేయడం ఛాయాచిత్రం ద్వారాబంధించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అతిధులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కావడం అధికారులు నిరంతరం పర్యవేక్షించి పారిశుధ్యం పై చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement