Sunday, April 28, 2024

murmu: హైదరాబాద్ కు రాష్ట్రపతి… ఆ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి ఇవాళ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement