Saturday, May 4, 2024

వికారాబాద్ కు పీఆర్ , ఎస్ఈ కార్యాలయాల మంజూరు – జడ్పీ చైర్పర్సన్ సునీత రెడ్డి

వికారాబాద్ మే 24 (ప్రభ న్యూస్):తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలిపారు .సీఎం కేసీఆర్, పీఆర్ మంత్రికి జడ్పి చైర్ పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు
వికారాబాద్ జిల్లా:తాండూరు నియోజకవర్గానికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యాలయాలు మంజూరు అయినట్లు జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ తో పాటు అదనంగా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ కార్యాలయాలు తాండూరుకు వచ్చాయన్నారు.

అలాగే ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న పీఆర్ ఎస్ఈ కార్యాలయం వికారాబాద్ కు తరలిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ నంబర్ 18, 19ని జారీ చేసిందని సునీతారెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీ రాజ్ లో పునర్వ్యవస్థీకరణ చేశారన్నారు. గత పదేళ్లుగా ఈ కార్యాలయాలు మంజూరు కోసం ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కొత్త కార్యాలయాలతో తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తవవుతాయని, అలాగే సర్పంచులు, ఎంపీటీసీ లకు, కాంట్రాక్టులకు ఈఈ కోసం వికారాబాద్ వెళ్లే అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా గౌరవ సీఎం కేసీఆర్ కి, పీఆర్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కి జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఈ కార్యాలయాలు ప్రారంభిస్తామని సునీతా రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement