Thursday, May 9, 2024

Power Politics – కాంగ్రెస్ బిజెపిలకు పాతర వేయాలిసిందే – మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జూలై 11తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలో బంగాళాఖాతంలో కలపాలని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పట్టణంలో మంత్రి మరియు ఎమ్మెల్యే గణేష్ గుప్తా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి కి ఓట్లేస్తే విద్యుత్ పంప్ సెట్ లకు మీటర్ల అమర్చుతారు. కాంగ్రెస్ కు ఓట్లేస్తే మూడు గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాత్రివేళ విద్యుత్తును పంపుసెట్లకు అందించడంతో ఎంతో మంది రైతులు విద్యుత్ షాకుకు, పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్కు ఓట్లేస్తే రైతులకు తిరిగి పాత రోజులు వస్తాయని మంత్రి హెచ్చరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ బిజెపిలో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, బిజెపి ఆదాని అంబానీల కోసం, కాంగ్రెస్ దళారుల కోసం పనిచేస్తుందని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ రైతాంగం మేలుకొని బిజెపి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా మరోసారి బయట పెట్టుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఉచితాలు వద్దంటూ మరోపక్క పెన్షన్లు ఎలా పెంచుతారని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు.

. కేటీఆర్ పిలుపుమేరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బుధవారం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లు మనిపించేలా రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement